English | Telugu
బన్నీకి ముదురు హీరోయిన్ నచ్చిందా?
Updated : Sep 23, 2015
చిత్రసీమలో ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పలేం. దుకాణం బంద్ అనుకొన్న తరుణంలో వచ్చిన ఓ ఛాన్స్... జీవితాన్ని మార్చేస్తుంది, మళ్లీ రేసులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రియమణికి అలాంటి అదిరిపోయే ఆఫరే వచ్చింది. గత కొంతకాలంగా అవకాశాల కోసం అల్లాడిపోతోంది ప్రియమణి.
తెలుగులోనే కాదు, తన మాతృభాషలోనూ ప్రియమణిని పట్టించుకోవడం లేదు ఎవ్వరూ. ఇక సినిమాలు వదిలేసి, పెళ్లి చేసుకొని జీవితంలో సెటిలైపోదామని ఫిక్సయ్యింది. ఈ దశలో ఆమెకు ఓ ఊహించని ఆఫర్ వచ్చింది. బన్నీ - బోయపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బోయపాటి సినిమా అంటే ఐటెమ్ పాట మస్టు. ఆ పాట ఎవరిని తీపుకొందామని ఆలోచిస్తోందటే.. ప్రియమణి పేరు సూచించాడట బన్నీ.
యంగ్ హీరోలంతా లేలేత భామల పేర్లు జపిస్తుంటే.. బన్నీ ప్రియమణి పేరు ఎందుకు సూచించాడో అర్థం కావడం లేదు బోయపాటికి. అయినా ఈ సినిమా బన్నీ సొంత నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కుతోంది. అందుకే బోయపాటి కూడా మారు మాట్లాడకుండా.. బన్నీ నిర్ణయానికి యస్ చెప్పేశాడట. పరిశ్రమ మర్చిపోయిన ప్రియమణిని బన్నీ ఏరి కోరి ఎందుకు ఎంచుకొన్నాడో మరి.