Read more!

English | Telugu

బొద్దుగుమ్మ భారీగా పెంచేసింది

టాలీవుడ్ లో అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తూ..తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొట్టేస్తుంది బొద్దుగుమ్మ హాన్సిక. ఈ అమ్మడు కి తమిళ ఇండస్ట్రీలో మంచి డిమాండే వుంది. ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా విజయం సాధిస్తుండటంతో హన్సిక కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. హన్సిక కూడా ఇదే మంచి సమయమని తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేసింది. ప్రస్తుతం విశాల్ సరసన చేస్తున్న అంబాల, విజయ్‌తో చేస్తున్న సినిమాలు కచ్చితంగా హిట్టవుతాయన్న అంచనాల నేపథ్యంలో,కొత్త సినిమాలు చేయడానికి ముందుకొస్తున్న నిర్మాతల్ని రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందట. దీంతో నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారట. రెండు కోట్లు ఈమెకి ఇచ్చే బదులు స్టార్ హీరోయిన్లతో సినిమా చేయవచ్చని వారు భావిస్తున్నారట. మరి ఈ అమ్మడు ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి!!