Read more!

English | Telugu

బాలయ్య సరసన మిర్చి భామ

 

బాలకృష్ణ నటిస్తున్న "లెజెండ్" సినిమాలోని ఓ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసాబసు ను ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమెను తప్పించి, ఆ ఐటెం సాంగ్ లో హంసానందినిని తీసుకున్నట్లు తెలిసింది. అసలే "మిర్చి", "అత్తారింటికి దారేది" వంటి సినిమాల్లో కాలు కదిపి మంచి పేరు తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడినే ఐటెం సాంగ్ కోసం ఎంపిక చేసుకున్నారని, ఈనెల 5వ తేదీ నుండి అన్నపూర్ణ స్టూడియోలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించనున్నట్లుగా చిత్ర యూనిట్ టాక్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఈనెల 7వ తేదిన విడుదల చేయనున్నారు.