English | Telugu

వైష్ణ‌వ్, ప్రియాంక‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం?

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. `ఫిదా` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ విడుద‌లైన‌ దాదాపు నాలుగేళ్ళ విరామం త‌రువాత `ల‌వ్ స్టోరి`తో ప‌ల‌క‌రించ‌నున్నారు శేఖ‌ర్. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ రొమాంటిక్ డ్రామా.. ఏప్రిల్ 16న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. `ల‌వ్ స్టోరి` రిలీజ‌య్యేలోపే నెక్ట్స్ వెంచ‌ర్ కి సంబంధించి ప‌నుల‌ను వేగ‌వంతం చేశార‌ట శేఖ‌ర్ క‌మ్ముల‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. త‌న గ‌త చిత్రాల శైలిలోనే రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గానే కొత్త‌ సినిమాని రూపొందించ‌బోతున్నార‌ట‌. అంతేకాదు.. `ఉప్పెన‌`తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన వైష్ణ‌వ్ తేజ్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ని టాక్. అలాగే.. `గ్యాంగ్ లీడ‌ర్`, `శ్రీ‌కారం` సినిమాల‌తో తెలుగువారిని అల‌రించిన ప్రియాంక అరుళ్ మోహ‌న్ ఇందులో నాయిక‌గా ఎంపికైంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే శేఖ‌ర్ క‌మ్ముల తదుప‌రి చిత్రంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.