English | Telugu

విజయ్ దేవరకొండతో 'జెర్సీ' డైరెక్టర్!!

'మళ్ళీ రావా' సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి.. ఆ తరువాత 'జెర్సీ'తో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం గౌతమ్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ తో 'జెర్సీ' హిందీ రీమేక్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

గౌతమ్ ఇటీవల విజయ్ దేవరకొండకి ఓ స్టోరీ చెప్పాడని.. గౌతమ్‌ చెప్పిన ఎమోషనల్‌ లవ్‌స్టోరీ విజయ్‌ కు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'లైగర్' చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్‌, శివ నిర్వాణ సినిమాల్లో నటించనున్నాడు. ఆ తర్వాత విజయ్- గౌతమ్ ల ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలున్నాయట.