English | Telugu
సమంతతో నెట్ ఫ్లిక్స్ భారీ వెబ్ సిరీస్!!
Updated : Jun 7, 2021
ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత అక్కినేని.. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఓటీటీ వరల్డ్ లోనూ సత్తా చాటుతోంది. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. దర్శకద్వయం రాజ్ & డీకే రూపొందించిన ఈ సిరీస్ కి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా 'రాజీ' అనే ఎల్టీటీఈ సభ్యురాలి పాత్రలో సమంత ఒదిగిపోయిన తీరుకి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సిరీస్ తో ఆమెకి నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు సమంత డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రీసెంట్ గా సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె ఒప్పుకుంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ వెబ్ సిరీస్ చేయాలని నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. నిజానికి తెలుగు వెబ్ కంటెంట్ విషయంలో నెట్ ఫ్లిక్స్ ఇప్పటివరకు పెద్దగా ఆట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన తెలుగు ఆంథాలజీ సిరీస్ 'పిట్టకథలు' నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ పాపులర్ స్టార్స్ తో సిరీస్ లు రూపొందించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ 2తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న సమంత తో సంప్రదింపులు జరుపుతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే నెట్ ఫ్లిక్స్ తో పాటు హాట్ స్టార్ సంస్థ దృష్టి కూడా సమంతపై పడిందని సమాచారం.
ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో తన క్రేజ్ మరింత పెంచుకున్న సమంత.. ఓ వైపు సినిమాలు, మరోవైపు సిరీస్ లతో బిజీబిజీగా గడుపుతోంది.