English | Telugu

మూడు భాగాలుగా 'బింబిసార'.. అన్న కోసం తారక్..!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మల్లిడి వశిస్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీలో బార్బేరియన్ కింగ్ బింబిసార గా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

'బింబిసార' చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కుతోందట. అయితే ప్రతి భాగానికి కొంత గ్యాప్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ 80 శాతం షూటింగ్ పూర్తి కాగా.. దీనికి దాదాపు 40 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులు కుదట పడగానే బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి.. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని చూస్తున్నారట. ఆ తరువాత మిగతా రెండు భాగాల చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ లో మూడు భాగాలుగా వచ్చే మొదటి సినిమా ఇదే అవుతుంది.

ఇక కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'బింబిసార' చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి తారక్ గొంతు తోడైతే మరో లెవల్ కి వెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారట.