English | Telugu

హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ బైలింగ్వ‌ల్ మూవీ!?

`జ‌యం` (2002) చిత్రంతో తెలుగునాట ప్ర‌తినాయ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపు పొందారు మ్యాచో స్టార్ గోపీచంద్. ఇక అదే సినిమా త‌మిళ్ రీమేక్ తో 2003లో కోలీవుడ్ లోనూ విజ‌యం అందుకున్నారాయ‌న‌. ఆపై క‌థానాయ‌కుడిగా టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయిన గోపీచంద్.. మ‌ళ్ళీ త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ వైపు దృష్టి సారించ‌లేదు.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. త్వ‌ర‌లో గోపీచంద్ ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేయ‌నున్నార‌ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు హ‌రి రూపొందించ‌నున్నార‌ని స‌మాచారం. `య‌ముడు` సిరీస్ తో తెలుగువారికి సుప‌రిచితుడైన హ‌రి.. ఇటీవ‌ల గోపీచంద్ కి ఓ స్టోరీ లైన్ చెప్పార‌ట‌. అది న‌చ్చ‌డంతో గోపీచంద్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్. అంతేకాదు.. ఇదో కాప్ డ్రామా అని అంటున్నారు. త్వ‌ర‌లోనే గోపీచంద్, హ‌రి కాంబో మూవీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే, గోపీచంద్ తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` జూలై 1న విడుద‌ల కానుంది. మ‌రోవైపు `ల‌క్ష్యం`, `లౌక్యం` చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో ఓ సినిమాని చేస్తున్నారు గోపీచంద్. అద‌య్యాకే హ‌రి డైరెక్టోరియ‌ల్ సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్.