English | Telugu
పవన్ తో మరోసారి..!?
Updated : Apr 5, 2022
రీసెంట్ గా `భీమ్లా నాయక్`గా పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్వరలో మరో రీమేక్ లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ చిత్రం `వినోదయ సిత్తమ్` (2021) ఆధారంగా రూపొందనున్న ఈ రీమేక్ మూవీలో `సుప్రీమ్` హీరో సాయితేజ్ కథానాయకుడిగా నటించనుండగా.. పవన్ కళ్యాణ్ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనున్నారు. మాతృకకి దర్శకత్వం వహించిన సముద్రఖని.. రీమేక్ కి కూడా మెగాఫోన్ పట్టనున్నారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ చిత్రం కోసం పవన్ 21 రోజుల కాల్షీట్స్ కేటాయించారని బజ్.
ఇదిలా ఉంటే, `భీమ్లా నాయక్` విజయంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన టెక్నీషియన్.. `వినోదయ సిత్తమ్` రీమేక్ లో కూడా భాగం కానున్నారట. అతనెవరో కాదు.. ఏస్ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్. దాదాపు 30 ఏళ్ళుగా ఛాయాగ్రాహకుడిగా రాణిస్తున్న రవి కె. చంద్రన్ ఇప్పటికే తెలుగులో `భరత్ అనే నేను`, `భీమ్లా నాయక్`కి పనిచేయగా.. ఈ రీమేక్ టాలీవుడ్ లో మూడో సినిమా కానుంది. మరి.. పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రవి కె. చంద్రన్ కి రెండో సారి కూడా కలిసొస్తుందేమో చూడాలి. కాగా, ఇదే ఏడాది చివరలో ఈ రీమేక్ రిలీజ్ కావచ్చని టాక్.