English | Telugu
బాలయ్య, రవితేజతో అనిల్ మల్టిస్టారర్!?
Updated : Apr 6, 2022
అగ్ర కథానాయకులు నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ.. త్వరలో మల్టిస్టారర్ చేయనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బాలయ్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఈ చిత్రంలో మరో కథానాయకుడికి కూడా స్థానముందట. కథకి కీలకమైన ఆ పాత్రలో రవితేజ నటిస్తారని సమాచారం. అదే గనుక నిజమైతే.. బాలయ్య, రవితేజ కాంబోలో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే బాలయ్య, రవితేజ మల్టిస్టారర్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే, బాలయ్య ప్రస్తుతం `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. మరోవైపు `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలతో రవితేజ బిజీగా ఉన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న `మెగా 154`లోనూ రవితేజ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.