English | Telugu

గోపీచంద్ ఆమెపై కోపంగా ఉన్నాడా?

 

గోపీచంద్, తాప్సీ జంటగా నటించిన తాజా చిత్రం "సాహసం". ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సంపాదించుకొని, మంచి వసూళ్ళను రాబడుతోంది. అయితే ఈ చిత్ర విజయం కంటే తాప్సీ చేసిన పనితీరు పై దర్శక, నిర్మాతలతో పాటు హీరో కూడా కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది.

 

ఈ చిత్రం విడుదలకు ముందు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి రావాలని ఈ చిత్ర దర్శక,నిర్మాతలతో పాటుగా హీరో గోపీచంద్ కూడా ప్రత్యేకంగా చెప్పినప్పటికీ హాజరు కాలేకపోయింది. అయితే ప్రస్తుతం సినిమా హిట్టు అనే టాక్ వినిపించేసరికి వెంటనే హైదరాబాద్ కు వచ్చేసి చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ విధంగా చేస్తున్న తాప్సీతో మరోసారి సినిమా చేయకూడదనే ఆలోచనలో ఉన్నారు గోపీచంద్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. మరి తాప్సీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో త్వరలోనే తెలియనుంది.