English | Telugu

పవన్ అభిమానులకు శుభవార్త

 

పవన్ అభిమానులకు పండగ. తమ అభిమాన నటుడు త్వరలోనే రాజకీయాలు అనే బురదలోకి దిగబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. పవన్ పార్టీ పేరు "జనసేన" అని తెలిసింది. ఇదిలా ఉంటే పవన్ పెట్టబోయే పార్టీకి ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఎన్నికల కమీషన్ ఎన్నికల కోడ్ ను విడుదల చేసేసింది కాబట్టి కొత్త పార్టీలకు చోటు లేదు. పైగా ఎన్నికలు ఇంకో 2 నెలల్లోనే జరగబోతున్నాయి. ఈ సందర్భంలో పవన్ పార్టీ పెట్టే అవకాశం లేదు. కావున పవన్ కళ్యాణ్ "జనసేన" పార్టీ దాదాపు లేనట్లుగానే అనుకోవచ్చు. ఒక విధంగా పవన్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త అయినప్పటికీ కూడా రేపు సమావేశంలో పవన్ ఏం చెప్తాడో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.