English | Telugu
గౌతమి పుత్రలో కాపీ ట్యూన్లా??
Updated : Dec 20, 2016
చిరంజీవి అమ్మడు - లెట్స్ డూ కుమ్ముడూ పాటపై కాపీ మరక అంటే సింది. ఈ పాటని చెడుగుడు ఆడేసుకొంటున్నారు నాన్ మెగా ఫ్యాన్స్. ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కి అవకాశం రాబోతోందా?? గౌతమి పుత్ర శాతకర్ణిలోనూ కాపీ ట్యూన్లు ఉన్నాయా?? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. బాలకృష్ణ - క్రిష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈనెల 26న పాటల్ని విడుదల చేస్తున్నారు. చిరంతన్ భట్ అందించిన ఈ ఆల్బమ్‌లో ఆరు పాటలున్నాయి. అయితే అందులో మూడు పాటలు కాపీ అట. హిందీ సినిమా బాజీరావు మస్తానీలో ని మూడు పాటల్ని అచ్చుగుద్దినట్టు దింపేశారట. ఆర్.ఆర్‌నీ వాడినట్టు తెలుస్తోంది. అయితే అందుకు గానూ చిత్రబృందం ముందే రైట్స్ రూపంలో కొంత చెల్లించిందని సమాచారం. కొత్త ట్యూన్లు కంపోజ్ చేయడానికి టైమ్ దొరక్కపోవడం వల్లే బాజీరావు మస్తానీ పాటల్ని యధాతథంగా వాడుకొన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని చిత్రృందం అధికారికంగా బయటపెడుతుందా? లేదంటే కామ్‌గా ఊరుకొంటుందా అనేది తెలియాల్సివుంది. ఈనెల 26న గౌతమి పుత్ర పాటల్ని తిరుపతిలో విడుదల చేస్తారు. నారాచంద్రబాబునాయుడు, వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని సమాచారం.