English | Telugu

అరవింద్ అందుకే చేయనంటున్నాడా..?

ధృవ సినిమాలో స్టైలిష్ విలన్ పాత్రతో తెలుగులో ఫుల్ పాపులర్ అయిపోయాడు అరవింద్ స్వామి. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలంతా అరవింద్ ఇంటిముందు క్యూకట్టారు. ఎంత కావాలంటే అంత ముట్టజెప్పేందుకు రెడీ అన్నారు. అయితే ప్రస్తుతం తన దృష్టంతా తమిళ సినిమాలమీదే ఉందని...వేరే భాషల సినిమాలు చేయలేనని...అంతేకాకుండా తాను కొత్త భాష నేర్చుకోవడం చాలా కష్టమని సున్నితంగా చెప్పాడు స్వామి. అయితే దీని వెనుక వేరే కథ ఉందని టాలీవుడ్ టాక్..తనీ ఒరువన్ సినిమాకి అటు రైటర్‌గా..ఇటు విలన్‌గా రెండు పాత్రలు పోషించాడు అరవింద్..అందులో హీరోను డామినేషన్ చేసేంతగా ఉంటుంది అరవింద్ క్యారెక్టర్..

కానీ తెలుగుకి వచ్చేటప్పటికి చరణ్‌ను ఎక్కువగా ఎలివేట్ చేశారు..వాస్తవానికి అరవింద్ క్యారెక్టర్‌ కన్నా ముందే చరణ్ పాత్రకు సంబంధించిన షూట్ చేశారు. ఎడిటింగ్ టైంలో అల్లు అరవింద్, చిరంజీవి జోక్యం చేసుకుని సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్‌‌ను తగ్గించేశారట..సినిమాలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ..ఇలా కావాలని ఎడిట్ చేయడం మాత్రం అరవింద్ స్వామిని చాలా నిరాశకు గురిచేసిందట. అందుకే హీరోల డామినేషన్ ఎక్కువగా ఉండే టాలీవుడ్‌లో సినిమాలు చేయకూడదని డిసైడయ్యాడనిపిస్తుంది..అయితే తప్పించుకోవడానికి కారణం కావాలి కాబట్టి తమిళ సినిమాలే ముఖ్యమని చెప్పినట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.