English | Telugu
పవన్ సహనాన్ని పరీక్షిస్తున్న శ్రుతిహాసన్??
Updated : Dec 20, 2016
స్టార్ హీరోలతో సినిమా అనేసరికి హీరోయిన్ల లెక్కలు మారిపోతుంటాయి. ఇది వరకు ఎలా ఉన్నా సరే... ఈ సినిమాకి మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సివస్తుంది. చెప్పిన టైమ్ కంటే ముందే సెట్లో ఉండాలి. హీరో గారు లేట్‌గా వచ్చినా ఫర్వాలేదు. హీరోయిన్‌మాత్రం ఆలస్యం అవ్వకూడదు. అయితే.. కాటమరాయుడు సెట్లో సీన్ రివర్స్ అయ్యిందని టాక్. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి డాలీ దర్శకుడు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. గబ్బర్ సింగ్ తరవాత పవన్ - శ్రుతి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమిదే. కాటమరాయుడు సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. అందుకే పగలూ రాత్రీ అనే తేడా లేకుండా షూటింగ్‌ని సాగిస్తున్నారు. అయితే... ఈ టీమ్‌ని మాత్రం శ్రుతిహాసన్ బాగా ఇబ్బంది పెడుతోందట. చెప్పిన సమయానికి షూటింగ్ కి రావడం లేదని, శ్రుతి వల్ల షూటింగ్‌కి అంతరాయం కలుగుతోందని, పవన్‌తో కాంబినేషన్ సీన్లు ఉన్నరోజున కూడా శ్రుతి ఇలానే షూటింగ్‌కి ఆలస్యంగా వచ్చిందని, శ్రుతి కోసం పవన్ కూడా ఎదురుచూడాల్సివచ్చిందని టాక్. దాంతో పవన్ శ్రుతి విషయంలో అసహనంతో ఉన్నాడని తెలుస్తోంది. పవన్‌కి అసలే కోపం ఎక్కువ. ఎప్పుడు ఎలా ఫైర్ అవుతాడో చెప్పలేం. ఈ విషయంలో శ్రుతి ఎంత త్వరగా తెలుసుకొంటే అంత మంచిది.