English | Telugu

ఆది గాలిపటం ఎగరేస్తాడా...?

 

"సుకుమారుడు" వంటి కామెడీ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చిన ఆదికి ఈ సినిమా నిరాశే మిగిల్చింది. సినిమా కామెడీ పరంగా బాగున్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆది ఓ కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఆది, ఎరికా ఫెర్నాండేజ్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి "గాలిపటం" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది పాత్ర చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందట.

ప్రస్తుతం ఆది హీరోగా రవి చావాలి దర్శకత్వంలో "ప్యార్ మే పడిపోయానే" అనే చిత్రం చేస్తున్నాడు. అదే విధంగా "రఫ్" అనే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు త్వరలో విడుదల కాబోతున్నాయి.