English | Telugu
29 ఏళ్ల భామతో అమీర్ ఖాన్ మూడో పెళ్లి!!
Updated : Jul 6, 2021
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఒక నటితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని.. అందుకే కిరణ్ రావుకి విడాకులు ఇచ్చి త్వరలోనే మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.
'దంగల్' మూవీలో అమీర్ ఖాన్ కి కూతురుగా నటించిన నటి ఫాతిమా సన షేక్ తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడని.. అందువల్లనే ఆమెకు అమీర్ తర్వాత చిత్రం 'ది థగ్స్ అఫ్ హిందూస్తాన్'లో నటించడానికి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ఇద్దరూ చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారని.. ఇద్దరూ కలిసి చాలా పార్టీలకు హాజరయ్యారని బాలీవుడ్ వర్గాలు గుస గుసలాడుతున్నాయి. ఫాతిమా ముంబైకి వచ్చిన ప్రతిసారి అమీర్ ను ఖచ్చితంగా కలుస్తుందని సమాచారం. ప్రస్తుతం 29 ఏళ్ళు ఉన్న ఫాతిమాతో ప్రేమ వ్యవహారం వల్లనే అమీర్ దంపతులు విడిపోయారని తెలుస్తోంది. విడాకుల విషయం కాస్త సద్దుమనిగాక 56 ఏళ్ళ అమీర్.. 29 ఏళ్ళ ఫాతిమాని పెళ్లి చేసుకోబుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా, 1986లో రీనా దత్తాని పెళ్లి చేసుకొని 15 ఏళ్ళకే విడాకులు తీసుకున్న అమీర్.. తర్వాత 2005లో కిరణ్ రావును వివాహం చేసుకొని 15 ఏళ్ళకి మరోసారి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా 29 ఏళ్ల భామను మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.