English | Telugu

అట్లీ దర్శకత్వంలో తారక్ లవ్ స్టోరీ!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్- కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్ లో సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అట్లీ కూడా తారక్ తో సినిమా ఉంటుందని అప్పట్లో చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. వీరి కలయికలో ఒక లవ్ స్టొరీ రానుందని టాక్ వినిపిస్తోంది.

ఇటీవ‌ల అట్లీ.. తార‌క్‌ కు ఓ క‌థ చెప్పాడ‌ట. అది అట్లీ తొలి సినిమా 'రాజా రాణి' త‌ర‌హాలో ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ అని తెలుస్తోంది‌. స్టోరీ లైన్ తార‌క్‌ కు బాగా న‌చ్చింద‌ని.. పూర్తి స్క్రిప్టుతో రావాల‌ని అట్లీకి చెప్పాడ‌ని స‌మాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్న అట్లీ.. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.

తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. త‌ర్వాత కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు చేయాల్సి ఉంది. ఇక అట్లీ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేయనున్నాడు.