English | Telugu
'జనతా గ్యారేజ్' లో మలయాళ స్టార్..!!
Updated : Dec 30, 2015
యంగ్ టైగర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళ కుట్టి నిత్యా మీనన్‌ను ఓ కథానాయికగానూ ఎంచుకున్నాడతను. ఐతే ఈ సినిమాలో మరో మలయాళ ఆర్టిస్ట్ కీలక పాత్ర పోషించబోతున్నాడట. మలయాళంలో మంచి చిత్రాలు చేస్తూన్న ఫాహద్ ఫాజిల్ 'జనతా గ్యారేజ్'లో ఓ క్యారెక్టర్ చేయబోతున్నాడట. కొరటాల చెప్పిన కథ నచ్చి అతనీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. నవంబర్ లో లాంచింగ్ కార్యక్రమాలు జరుపుకున్నఈ చిత్రం ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు.