English | Telugu
`ఢీ` సీక్వెల్ లో `జాతిరత్నాలు` భామ?
Updated : Jun 16, 2021
నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ రోల్స్ లో నటించిన `జాతిరత్నాలు`.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ అవుట్ అండ్ అవుట్ కామిక్ ఎంటర్టైనర్ తోనే ఫారియా అబ్దుల్లా కథానాయికగా తొలి అడుగేసింది. చిట్టి పాత్రలో తనదైన నటనతో కుర్రకారుని ఫిదా చేసింది.
కట్ చేస్తే.. ఇప్పుడీ టాలెంటెడ్ యాక్ట్రస్ కి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నాయికగా నటించే అవకాశం దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. 2007 నాటి బ్లాక్ బస్టర్ మూవీ `ఢీ`కి సీక్వెల్ గా `డి అండ్ డి` (డబుల్ డోస్) పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `ఢీ` కథానాయకుడు మంచు విష్ణు ఇందులో హీరోగా నటిస్తుండగా.. `ఢీ` కెప్టెన్ శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా, ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా ఫారియాని ఎంపిక చేశారట. త్వరలోనే `ఢీ` సీక్వెల్ లో ఫారియా ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. `జాతిరత్నాలు` తరువాత ఫారియా చేయనున్న ఈ సినిమా.. ఆమె కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
`డి అండ్ డి`ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తుండగా.. మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్నాడు.