English | Telugu
`ఐకాన్`కి తమన్ బాణీలు?
Updated : Jun 16, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - యువ సంగీత సంచలనం తమన్ ది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలు (`రేసుగుర్రం` (2014), `సరైనోడు` (2016), `అల వైకుంఠపురములో` (2020)) కూడా .. అటు మ్యూజికల్ గానూ, ఇటు కమర్షియల్ గానూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాంటి ఈ ఇద్దరి కాంబోలో స్వల్ప విరామం అనంతరం మరో చిత్రం రాబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. `వకీల్ సాబ్` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` పేరుతో బన్నీ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కనుంది. కాగా, ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడని టాక్. త్వరలోనే `ఐకాన్`లో తమన్ ఎంట్రీపై స్పష్టత రానున్నది. మరి.. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన బన్నీ - తమన్ కాంబో `ఐకాన్`తోనూ ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` చేస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా సందడి చేయనుంది. కాగా, `పుష్ప` మొదటి భాగం పూర్తయ్యాకే `ఐకాన్` పట్టాలెక్కనుంది. వచ్చే నెలలో `ఐకాన్`కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.