English | Telugu

బాహుబ‌లికి షాక్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌?

బాహుబ‌లితో మార్కెట్ లెక్క‌ల‌న్నీ మారిపోయాయి. దెబ్బ‌కు రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లైపోయాయి. బాహుబ‌లి సృష్టించిన రికార్డులు మ‌రే తెలుగు సినిమా బ‌ద్ద‌లు కొట్ట‌లేదు అనే ధీమా వ‌చ్చేసింది. కాక‌పోతే.. బాహుబ‌లి రికార్డులూ శాశ్వ‌తం కాద‌న్న‌ది నిజం. కొన్ని రికార్డుల‌కు అప్పుడే చెద‌లు ప‌ట్టేస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా శాటిలైట్ రికార్డ్ చెరిగిపోయే ప్ర‌మాదంలో ప‌డింది. బాహుబ‌లి రెండు భాగాలూ క‌లిపి మాటీవీ రూ.30 కోట్ల‌కు కొనేసింది.

అంటే.. ఒక్కో భాగానికీ రూ.15 కోట్ల‌న్న‌మాట‌. స్టార్ హీరోల సినిమాల‌న్నీ రూ.10 నుంచి రూ.12 కోట్ల‌లోపే శాటిలైట్లు ప‌లుకుతున్నాయి. రూ.15 కోట్లు అందుకోవాలంటే కొంత స‌మ‌యం ప‌డుతుంద‌నుకొన్నారు. కానీ రామ్ చ‌ర‌ణ్.. ఈ రికార్డుకి సైతం చ‌మ‌ర‌గీతం పాడేశాడు. చ‌ర‌ణ్ - సుకుమార్‌ల రంగ‌స్థ‌లం రూ.16 కోట్ల‌కు అమ్ముడుపోయింద‌ని టాక్‌. ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ రంగ‌స్థ‌లం శాటిలైట్ హ‌క్కుల్ని రూ.16 కోట్ల‌కు కొనేందుకు ముందుకు వ‌చ్చింద‌ని, దాంతో బాహుబ‌లి రికార్డు బ‌ద్ద‌లైపోయింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సో.. మెగా ఫ్యాన్స్ కి ఇది పండ‌గ లాంటి వార్తే క‌దా??