English | Telugu
"దొంగల ముఠా"కి అప్పల్రాజు దెబ్బ
Updated : Feb 23, 2011
ఈ మధ్య విడుదలైన "కథ, స్క్రీన్ ప్లె, దర్శకత్వం అప్పల్రాజు" చిత్రం ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మకి పీడకలలా తయారవుతోంది. ఒక పక్క ఈ చిత్రాన్ని విలేఖరులు చీల్చిచెండాడుతుంటే, మరోపక్క రెండు రోజుల బంద్ కారణంగా అసలే బలహీనంగా ఉన్న కలెక్షన్లు మరింత బలహీనపడి బాక్సులు వెనక్కి వచ్చేలా ఉన్నాయి. అప్పల్రాజు పోతే పోయిందిలే అనుకుంటే ఈ సినిమా ప్రభావం తాను ప్రతిష్టాత్మకంగా అయిదు రోజుల అతి తక్కువ సమయంలో తీస్తున్న పూర్తి కమర్షియల్ "దొంగల ముఠా" చిత్రం మీద పడుతుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. మూణ్ణెల్లు తీసిన అప్పల్రాజు సినిమానే అంతంత మాత్రంగా ఉంటే అయిదు రోజుల్లో తీసిన ఈ "దొంగల ముఠా" చిత్రం ఇంకేలా ఉంటుందోనని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లూ ఈ "దొంగల ముఠా" సినిమాని కొనటానికి భయపడుతున్నారని సినీ పండితులంటున్నారు. పాపం అప్పల్రాజు దెబ్బకి "దొంగల ముఠా" దెబ్బకి ఠా అవుతుందేమో మరి. వేచి చూడాలి.