English | Telugu

డీజే ఒకరు కాదా..? ఇద్దరా..?

అల్లు అర్జున్ లేటేస్ట్ మూవీ డీజే‌పై టాలీవుడ్‌లో చాలా అంచనాలున్నాయి. దీనికి తోడు గుడిలో బడిలో సాంగ్‌‌పై వివాదం కమ్ముకోవడంతో ఈ సినిమాకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. దీనిలో బ్రాహ్మణ యువకుడిగా, డీజేగా రెండు విభిన్న కోణాలున్న పాత్ర చేశారు. అయితే డీజేలో బన్నీ డ్యూయెల్ రోల్ చేశాడని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో ఒక క్యారెక్టర్ అమాయకంగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటే, మరో క్యారెక్టర్‌ వైలెంట్‌గా ఉంటుందని చెప్పాడు. అంటే డ్యూయెల్ రోల్ చేశాడా లేక సినిమాపై ఎక్స్‌పెక్టేషన్ పెంచేందుకు అలా అన్నాడా తెలియాలంటే జూన్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.