English | Telugu

కొడుక్కి హిట్టిచ్చినా..నమ్మకం లేని నాగార్జున

నాగార్జున కెరీర్‌లో తొలి సారి 50 కోట్ల మార్కును సాధించి..ఆ ఏడాది సూపర్‌హిట్ మూవీల్లో ఫస్ట్ ప్లేస్‌ను అందుకుంది "సోగ్గాడే చిన్నినాయన". ఆ సంతోషంలో తన కొడుకు నాగచైతన్యను డైరెక్ట్ చేసే ఛాన్సిచ్చాడు నాగార్జున. అంతేకాదు సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్‌గా బంగారు రాజు అనే సినిమాను తీయాలని కళ్యాణ్‌తో చెప్పాడు. అనుకున్న విధంగానే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చైతూ కెరీర్‌లోనే భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయినప్పటికీ కళ్యాణ్ కృష్ణ హ్యాపీగా ఉండటం లేదట. దీనికి కారణం నాగార్జునేనట. రా రండోయ్ హిట్ అయినా కానీ అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచలేదని కింగ్ ఫీల్ అవుతున్నాడట. అందుకే ఇంకొన్నాళ్లు వెయిట్ చేద్దామని కళ్యాణ్‌తో అన్నాడట నాగార్జున. దీంతో బంగారు రాజు కోసం వెయిట్ చేయాలా లేదంటే మరో స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుని మరో హీరోని వెతకాలా అన్న కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాడట కళ్యాణ్‌కృష్ణ.