English | Telugu

హరీశ్ శంకర్ పవన్ ఫ్యాన్స్‌ని బుట్టలో పడేశాడా..?

గత కొంత కాలంగా అల్లు అర్జున్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒక మనసు ఆడియో లాంఛ్‌లో చెప్పను బ్రదర్ అన్న ఒకే ఒక్క మాటతో పవర్‌స్టార్ అభిమానులకి ఆగ్రహం కలిగించాడు. ఇక చూసుకోండి..బన్నీకి వ్యతిరేకంగా నెగిటీవ్ పబ్లిసిటీ మొదలెట్టారు పవన్ అభిమానులు. అంతేనా స్టైలీష్ స్టార్ లేటేస్ట్ మూవీ డీజే టీజర్‌ను డిజ్‌లైక్స్‌తో చిల్చీ చెండారు. ఒక దశలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి కూడా డీజే యూనిట్ భయపడిందని ఫిలింనగర్‌లో పుకార్లు వచ్చాయి. అయితే అన్ని అడ్డంకులను తట్టుకుని ఆడియో లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించింది చిత్రయూనిట్. ఆ కార్యక్రమానికి పవన్ అభిమానులు వస్తారని..ఖచ్చితంగా పవర్‌స్టార్ గురించి మాట్లాడాలని గోల చేస్తారని ఊహించిన డైరెక్టర్ హరీశ్ శంకర్..పవన్‌ని ఆకాశానికెత్తాశారు. అప్పుడెప్పుడో గబ్బర్‌సింగ్ సక్సెస్ సందర్భంగా తనకు పవన్‌కు మధ్య జరిగిన సంభాషణ‌ను వివరించాడు. ఇంకేముంది దీనిపై సంతోషం వ్యక్తం చేసిన పవన్ అభిమానులు ఆడిటోరియంలో పవర్‌స్టార్..పవర్‌స్టార్ అంటూ అరుపులు, కేకలు పెట్టారు. గండం గడిచినందుకు హరీశ్ కూడా హమ్మయ్య అనుకున్నాడు అని ఫిలింనగర్‌ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు.