English | Telugu
మెగాస్టార్ సినిమాలో నేషనల్ క్రష్!?
Updated : Feb 28, 2022
రీసెంట్ గా `పుష్ప - ద రైజ్`లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జోడీగా సందడి చేసిన నేషనల్ క్రష్ రష్మికా మందన్న.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించనుందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. చిరంజీవి కథానాయకుడిగా యువ దర్శకుడు వెంకీ కుడుముల ఓ సినిమాని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. `మెగా 156` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ సినిమాలో కథానాయికగా `మాస్టర్` ఫేమ్ మాళవికా మోహనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఇందులో రష్మిక కూడా దర్శనమివ్వనుందట. అయితే, కథానాయికగా కాదు.. ఓ స్పెషల్ రోల్ కోసం. ఇంతకీ ఆ పాత్ర ఏంటన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన తొలి రెండు చిత్రాలు `ఛలో`, `భీష్మ`లో రష్మికనే కథానాయిక. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ విన్నర్స్ కావడంతో.. సెంటిమెంట్ రీత్యా మూడో చిత్రంలోనూ రష్మికని నటింపజేసే ప్రయత్నం చేస్తున్నాడట వెంకీ. ఏదేమైనా.. త్వరలోనే `మెగా 156`లో రష్మిక ప్రత్యేక పాత్రపై స్పష్టత రానున్నది.
ఇదిలా ఉంటే, గతంలో రష్మిక నటించిన కొన్ని చిత్రాల వేడుకలకు చిరు అతిథిగా విచ్చేశారు. అలాంటి మెగాస్టార్ కి ఇప్పుడు అతిథి కావడం రష్మిక వంతు కానుందన్నమాట.