కీర్తి, తమన్నా, రాశీ ఖన్నా.. సేమ్ రూట్!
on Feb 21, 2022

గత కొంతకాలంగా దక్షిణాదిన కోర్ట్ డ్రామాల హవా నడుస్తోంది. పోయినేడాది `వకీల్ సాబ్`లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `జై భీమ్`లో కోలీవుడ్ స్టార్ సూర్య.. లాయర్స్ గా ఇంప్రెస్ చేశారు. అలాగే `నాంది`లో వరలక్ష్మీ శరత్ కుమార్, `చెక్`లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నిరుడు న్యాయవాదుల పాత్రల్లో దర్శనమిచ్చారు.

కాగా, ఈ సంవత్సరం దక్షిణాదిన ముగ్గురు స్టార్ బ్యూటీస్ లాయర్ వేషాల్లో కనిపించబోతున్నారు. వారే.. తమన్నా, రాశీ ఖన్నా, కీర్తి సురేశ్. మే 20న విడుదల కానున్న `పక్కా కమర్షియల్`లో కథానాయకుడు గోపీచంద్ తో పాటు వకీల్ గా అలరించనుంది రాశీ ఖన్నా. అలాగే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `వేదాళం` రీమేక్ `భోళా శంకర్`లో తమన్నా కూడా ప్లీడర్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఏడాది చివరలో రిలీజయ్యే అవకాశముంది. ఇక మలయాళ చిత్రం `వాషి`లోనూ కేరళకుట్టి కీర్తి సురేశ్ లాయర్ గా అభినయించింది.

తెలుగులోనూ ఈ సినిమా అనువాదమయ్యే అవకాశముందంటున్నారు. మరి.. న్యాయవాదుల పాత్రల్లో కీర్తి, తమన్నా, రాశీ ఖన్నా ఏ మేరకు రాణిస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



