English | Telugu
అయ్యో రాధా... ఇక రానట్లే !
Updated : Apr 10, 2014
వెంకటేష్ హీరోగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతుందనుకున్న "రాధా" చివరకు అటకెక్కి కూర్చుంది. ఈ సినిమా కథపై వచ్చిన వివాదం ఇంకా పూర్తికాలేదు. అలాగే వెంకీ చెప్పిన మార్పులను మారుతి సరిగ్గా చేయకపోవడంతో వెంకీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం వెంకీ "దృశ్యం" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే "రాధా" పోయిందనే భాదలో ఉన్న మారుతి హీరో నితిన్ తో ఓ సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఇటీవలే నితిన్ కు మారుతి ఓ యుత్ ఫుల్ లవ్ స్టొరీ చెప్పాడట. నితిన్ కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ ఈ సినిమాలో ఎలాంటి చెత్త సన్నివేశాలు, మాటలు ఉండకూడదని నితిన్ కండిషన్లు పెట్టాడట. ప్రస్తుతం మారుతి స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
నితిన్ చేతిలో ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. నితిన్ నటిస్తున్న "కొరియర్ బాయ్ కళ్యాణ్" చిత్రం త్వరలోనే విడుదల కానుంది.