English | Telugu
గోపీచంద్ కి జోడీగా `ఖిలాడి` బ్యూటీ!?
Updated : Feb 14, 2022
`సీటీమార్`తో చెప్పుకోదగ్గ విజయం అందుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్.. త్వరలో `పక్కా కమర్షియల్`తో పలకరించబోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ కోర్ట్ డ్రామా.. వేసవి కానుకగా మే 20న జనం ముందుకు రానుంది. ఈ లోపే మరో కొత్త సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు `రణం` స్టార్. తనతో `లక్ష్యం`, `లౌక్యం` వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు శ్రీనివాస్ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. కోల్ కత్తా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో వెర్సటైటిల్ స్టార్ జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు.
Also Read:ఏపీకి సినిమా ఇండస్ట్రీ తరలిపోతుందా? జగన్ పట్టుదల నెరవేరుతుందా?
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా `ఖిలాడి` బ్యూటీ డింపుల్ హయాతి కనిపించబోతోందట. అటు గ్లామర్ కి, ఇటు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో డింపుల్ ఎంటర్టైన్ చేయనుందట. అలాగే, మరో కథానాయికకి కూడా ఈ సినిమాలో స్థానముందని అంటున్నారు. మరి.. నాయికగా సాలిడ్ హిట్ లేని డింపుల్ హయాతికి గోపీచంద్ - శ్రీనివాస్ కాంబో మూవీతోనైనా విజయం దక్కుతుందేమో చూడాలి. కాగా, ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్నాడు.