English | Telugu

విజ‌య్‌తో పూరి 'జ‌న గ‌ణ మ‌న‌'!

మ‌హేశ్‌బాబు హీరోగా పూరి జ‌గన్నాథ్ డైరెక్ట్ చేసిన 'పోకిరి' ఇండ‌స్ట్రీ హిట్ట‌వ‌గా, ఆ త‌ర్వాత వ‌చ్చిన 'బిజినెస్‌మేన్' కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. అలాంటి సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌లో మూడో సినిమా వ‌స్తే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ ఆశించారు. ఆ ప్రాజెక్టును జ‌గ‌న్ అనౌన్స్ చేశారు కూడా. మ‌హేశ్‌తో 'జ‌న గ‌ణ మ‌న' అనే సినిమాని రూపొందించనున్న‌ట్లు, మ‌హేశ్‌కు క‌థ బాగా న‌చ్చింద‌నీ అప్ప‌ట్లో చెప్పారు. దానికి సంబంధించిన పోస్ట‌ర్ కూడా విడుద‌లై అభిమానుల్లో సంబ‌రాన్ని నింపింది.

క‌ట్ చేస్తే.. 'జ‌న గ‌ణ మ‌న' ఆరంభం కాకుండానే ఆగిపోయింది. మ‌హేశ్‌, పూరి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తాయి. క్లైమాక్స్ విష‌యంలో మ‌హేశ్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడ‌ని అప్ప‌ట్లో వినిపించింది. అయితే జ‌న గ‌ణ మ‌న‌ను త‌న‌న క‌ల‌ల ప్రాజెక్టుగా చెప్పుకున్న జ‌గ‌న్‌.. క‌థ‌ను మార్చేందుకు ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌లేదు. దాంతో అప్ప‌ట్నుంచీ ఆ ప్రాజెక్టును ఆయ‌న ఏ హీరోతో చేస్తాడోన‌ని అనేక‌మంది ఎదురుచూస్తూ వ‌చ్చారు. ఒకానొక స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ ప్రాజెక్టు చేస్తార‌ని వినిపించింది. అది కూడా కార్య‌రూపం దాల్చ‌లేదు.

ఇప్పుడు 'జ‌న గ‌ణ మ‌న‌'ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లు గ‌ట్టిగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ త‌మ తొలి కాంబినేష‌న్‌లో 'లైగ‌ర్' మూవీని చేస్తున్నారు. ఆదివారం ఆ మూవీ షూటింగ్ పూర్త‌యింది. ఏక కాలంలో తెలుగు, హిందీ భాష‌ల్లో లైగ‌ర్‌ను తీస్తున్నారు. షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా, "ఇప్పుడే 'లైగ‌ర్' షూట్ పూర్త‌యింది. ఈరోజుతో జ‌న గ‌ణ మ‌న" అని పూరి ఒక వాయిస్ నోట్‌ను రిలీజ్ చేశారు. దీంతో విజ‌య్‌కు ఆయ‌న 'జ‌న గ‌ణ మ‌న' స‌బ్జెక్టును చెప్పాడ‌నీ, విజ‌య్ కూడా ఓకే చెప్పేశాడ‌నీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ న్యూస్ వ‌స్తుందంటున్నారు.