English | Telugu

త్వరలో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్న అల్లు అర్హ!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ బుజ్జి బుజ్జి మాటలతో అందరినీ ఫిదా చేస్తుంటుంది. అర్హ చేసే అల్లరిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ మురిసిపోతుంటాడు బన్నీ. క్యూట్ డైలాగ్స్, క్యూట్ స్టెప్స్ తో అర్హ కనిపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే అర్హ అల్లరిని త్వరలోనే వెండితెరపై చూడనున్నామని తెలుస్తోంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న చిత్రంతో అర్హ బాలనటిగా ఆరంగేట్రం చేయనుందని సమాచారం. బాలల చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. అర్హను ప్రధాన పాత్రకు ఎంపిక చేసుకున్నారట. కొత్త దర్శకుడు సురేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారట. ఇదే సినిమాతో టాలీవుడ్ కి చెందిన పలువురి వారసులు తెరకు పరిచయమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. తన అల్లరితో సోషల్ మీడియాలో అలరిస్తోన్న అర్హ.. సిల్వర్ స్క్రీన్ పై ఎలా సందడి చేస్తుందో చూడాలి.