English | Telugu
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చార్మి నిర్మాణంలో సినిమా!!
Updated : Jul 1, 2021
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ హీరోగా.. నటి, నిర్మాత చార్మి ఓ సినిమా నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. దేవీ హీరోగా నటించనున్నారని గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. గతంలో దేవీని హీరోగా సుకుమార్ పరిచయం చేస్తారని ఒకసారి.. మంగళ మూవీ డైరెక్టర్ తులసీరామ్ దర్శకత్వంలో దేవీ సినిమా చేయనున్నాడని మరోసారి ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు దేవీ హీరోగా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మరోసారి ప్రచారం మొదలైంది.
దేవీ హీరోగా చార్మి ఓ సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నటిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన చార్మి.. ఆ తర్వాత నిర్మాతగా మారి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ నిర్మాత కరణ జోహార్ తో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దేవీ హీరోగా చార్మి ఓ సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నారట.
కాగా, గతంలో దేవీ-చార్మి మంచి స్నేహితులు. ఒకానొక సమయంలో వీరు ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ కొంతకాలంగా ఎందుకో వీరు ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టు అనిపించింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వీరి కాంబినేషన్ లో మూవీ రానుందని న్యూస్ రావడం హాట్ టాపిక్ గా మారింది.