English | Telugu
`సాహో` దర్శకుడితో ధనుష్?
Updated : Jun 30, 2021
కోలీవుడ్ స్టార్ ధనుష్ త్వరలో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించనున్న ఈ పాన్ - ఇండియా మూవీ.. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. కాగా, ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళముందే.. `తొలిప్రేమ`, `రంగ్ దే` చిత్రాల దర్శకుడు వెంకి అట్లూరి కాంబినేషన్ లో ధనుష్ ఓ బైలింగ్వల్ మూవీ చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ధనుష్ మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో `సాహో` చిత్రాన్ని తెరకెక్కించిన సుజీత్. కోలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. ధనుష్ ఏజ్, ఇమేజ్ కి తగ్గట్టు సుజీత్ ఓ యాక్షన్ డ్రామాని నేరేట్ చేశాడట. అది నచ్చడంతో ధనుష్ కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించాడని టాక్. అంతేకాదు.. వచ్చే ఏడాది చివరలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందంటున్నారు.
కాగా, ధనుష్ ప్రస్తుతం `ఆత్రంగి రే` (హిందీ), కార్తిక్ నరేన్ డైరెక్టోరియల్ (తమిళ్), `ద గ్రే మ్యాన్` (ఆంగ్లం) చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అలాగే తన సోదరుడు, ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.