English | Telugu

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మగధీర సీక్వెల్ ఎప్పుడంటే?..

దర్శక ధీరుడు రాజమౌళి- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన 'మగధీర' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. 2009లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చరణ్ కెరీర్‌లో రెండవ సినిమాగా వచ్చిన 'మగధీర'తో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే మగధీర మూవీ అంటే మెగా ఫ్యాన్స్ కి ప్రత్యేక అభిమానం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పైనే మగధీర సీక్వెల్ చేయాలనే ఆలోచన బలపడిందని అంటున్నారు. ఎప్పటినుంచో మగధీర సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్న రాజమౌళి.. దీని గురించి చరణ్ తో చర్చించగా.. వెంటనే చరణ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, చరణ్ తమిళ దర్శకుడు శంకర్ తో ఒక పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఇక రాజమౌళి కూడా తదుపరి సినిమాను మహేష్ బాబుతో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాత 'మగధీర' సీక్వెల్ ఉంటుందని న్యూస్ వినిపిస్తోంది.