English | Telugu

బ్రోకర్ తో దాసరికి విభేదాలా ?

 

పోసాని కృష్ణమురళీ నటించిన "బ్రోకర్2" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఇందులో దాసరి మళ్లీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడు బ్రోకర్ కి చాలా డిమాండ్ ఉంది. ఒక పార్టీ విలీనం కావాలనుకున్నా, ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ టికెట్ పొందాలనుకున్నా, విడదీయలనుకున్నా కూడా బ్రోకర్ల పాత్రే కీలకం అన్నారు. నిజానికి రాష్ర్ట విభజనకి కారణం కూడా బ్రోకరే కారణం. దానికి నేను కొంత సమయం తీసుకొని ఆ బ్రోకర్ ఎవరో చెబుతాను, నేను కూడా ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని'' స్పష్టం చేశారు.

అయితే దాసరి మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటే సందేహం కలుగుతుంది. ఇంతకీ దాసరి అనుకుంటున్న ఆ బ్రోకర్ ఎవరు? ఎవరిని ఉద్దేశించి దాసరి ఆ వ్యాఖ్యలు చేశారు? అలాగే.... రాష్ట్రం విడిపోవడానికి ప్రత్యేకంగా ఓ బ్రోకర్ కారణమని దాసరికి తెలిసినపుడు అపుడే చెప్పవచ్చు కదా.. ఇపుడేందుకు ఇలా కామెంట్లు చేస్తున్నారు? ఆ బ్రోకర్ తో దాసరికి ఏమైనా విభేదాలు వచ్చాయా లేక ఇంతకాలం దాసరిని మాట్లాడనివ్వకుండా ఎవరైనా అడ్డుకున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి ఆ బ్రోకర్ ఎవరన్నది దాసరి ఎప్పుడు చెబుతారో చూడాలి