English | Telugu
"బిజినెస్ మ్యాన్"తో "దమ్ము" టీజర్
Updated : Jan 9, 2012
"బిజినెస్ మ్యాన్"తో "దమ్ము" టీజర్ కూడా విడుదల చేస్తారట. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రంతో పాటు యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న "దమ్ము" చిత్రం టీజర్ కూడా విడుదల చేస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందన్న ఆలోచనలో "దమ్ము" చిత్ర నిర్మాత అలెగ్జాండర్ వల్లభ ఉన్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.
క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యన్ టి ఆర్ హీరోగా, త్రిష, కార్తీక హీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో, అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం "దమ్ము". నిజానికి ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది. మరి ఇప్పుడే టీజర్ ఎలా విడుదల చేస్తారన్న అనుమానం కూడా చాలా మందికి వచ్చింది. ఈ రోజుల్లో సినిమా పబ్లిసిటీ చేయటానికి నిర్మాతలు కొత్త కొత్త ఉపాయలను వెతుకుతున్నారనటానికిదే ఉదాహరణ