English | Telugu

కొరియర్ బాయ్ క‌ల్యాణ్ ఇక రాడా..??

ఇష్క్, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు నితిన్‌. ఇప్పుడు చిన‌దానా నీకోసం సినిమాతో బిజీగా ఉన్నాడు. డిసెంబ‌రులో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే అంత‌కు ముందే కొరియర్ బాయ్ క‌ల్యాణ్ అనే సినిమాలో న‌టించాడు నితిన్‌. గౌత‌మ్ మీన‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా దాదాపుగా పూర్త‌యింది కూడా. కానీ విడుద‌ల చేసుకొనే పొజీష‌న్‌లో లేర‌ట‌. గౌత‌మ్ మీన‌న్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండ‌డం వ‌ల్ల‌, ఈ సినిమాని విడుద‌ల చేయ‌లేక‌పోతున్నాడ‌ని టాక్‌. అంతేకాదు.. సినిమా ర‌షెస్ చూసిన నితిన్‌, గౌత‌మ్ మీన‌న్ పూర్తిగా నిరాశ‌లో కూరుకుపోయార‌ట‌. సినిమా అనుకొన్నంత బాగా రాలేద‌ని, ఈ సినిమాతో వ‌చ్చిన ఫామ్ పోగొట్టుకోలేన‌ని నితిన్ చెబుతున్నాడ‌ట‌. ఈ సినిమాపై మ‌రో రూపాయి పెట్టినా అది గోడ‌కు కొట్టిన సున్న‌మే అని గౌత‌మ్ మీన‌న్ కూడా ఫిక్స‌య్యాడ‌ట‌. చిన‌దానా నీ కోసం విడుద‌లై, సూప‌ర్ హిట్ట‌యితే... అప్పుడు ఆ ఊపులో కొరియర్ బాయ్ ని కూడా వ‌ద‌లాల‌ని డిసైడ్ అయ్యారు. అప్ప‌టి వ‌ర‌కూ ఈ కొరియ‌ర్ ఆల‌స్య‌మ‌న్న‌మాట‌.