English | Telugu

తన అందాలతో సెగలు పుట్టిస్తుందట !

 

సూర్య, సమంత కలిసి నటిస్తున్న "అంజాన్" చిత్రంలో హాట్ బ్యూటీ చిత్రాంగద సింగ్ కనిపించబోతుంది. ఇందులోని ఓ ఐటెం సాంగ్ లో తన అందాలతో పిచ్చేక్కించడానికి సిద్ధం అయ్యింది. ఇటీవలే ఈ సినిమాలోని ఓ మాస్ మసాలా పాటలో నటించమని ఈ అమ్మడిని చిత్ర దర్శక,నిర్మాతలు సంప్రదించగానే వెంటనే ఒప్పేసుకుందట. ఈ పాటలో ఈ పాప అందాల ప్రదర్శనతో కుర్రకారుకి పొగలు, సెగలు పుట్టించబోతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇందుకోసం ఈ అమ్మడికి నిర్మాత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అదిరిపోయే పాటలను అందిస్తున్నాడు. ఇందులో సూర్య, సమంత కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫోటోలకు మంచి స్పందన వస్తుంది. మరి ఈ అమ్మడు తన అందాలతో ఎంతమంది కుర్రకారులకు సెగలు పుట్టిస్తుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.