English | Telugu
తీన్ మార్ ఆడియోకి చిరు ఎందుకు రాలేదు
Updated : May 12, 2011
తీన్ మార్ ఆడియోకి చిరు ఎందుకు రాలేదు అన్న చర్చ ఫిలిం నగర్ లో చాలా వేడిగా వాడిగా జరుగుతోంది. వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవికీ ఆయన తమ్ముళ్ళకూ మధ్య సంబంధ బాంధవ్యాలు బయట కనిపిస్తున్నంత పటిష్టంగా లేవని సినీమా జనం అనుకుంటున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం ఆడియో ఫంక్షన్ కి కూడా చిరంజీవి కానీ, ఆయన కుమారుడు, యువ హీరో రామ్ చరణ్ కానీ హాజరుకాలేదనీ ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు.
కానీ అదే చిరంజీవి "బద్రీనాథ్" చిత్రం ఆడియోకి రావటం వలన మెగాస్టార్ చిరంజీవికీ ఆయన తమ్ముళ్ళకూ మధ్య సంబంధ బాంధవ్యాలు బయట కనిపిస్తున్నంత పటిష్టంగా లేవనే అనుమానం ఫిలిం నగర్ వర్గాలకు రేకెత్తేలా చేసింది. అదీగాక చిరంజీవి మిద తమ్ముళ్ళకన్నా బావ అల్లు అరవింద్ ప్రభావమే బలంగా ఉందనీ, ఆయన సూచనలతోనే "ప్రజారాజ్యం" పార్టీని కాంగ్రేస్ లో విలీనం చేయటం వంటి పనులు చేశాడనీ కూడా ఫిలిం నగర్ జనం బలంగా నమ్ముతున్నారు. ఇది నిజం కాదని తమ మధ్య సత్సంబంధాలే ఉన్నాయనీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మెగాబ్రదర్స్ మీదే ఉంది. కాదంటారా...?