English | Telugu

చిరంజీవి ఎంట్రీ.. అల్లు అర్జున్ అవుట్!

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మెగా, అల్లు అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ క్రేజీ డైరెక్టర్ ప్రాజెక్ట్ లోకి.. చిరంజీవి ఎంటరై, అల్లు అర్జున్ అవుట్ అయ్యాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. వరుసగా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో 'స్పిరిట్', రణబీర్ కపూర్ తో 'యానిమల్ పార్క్'తో పాటు అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి పేరు తెరమీదకు వచ్చింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేసే అవకాశముంది అంటున్నారు. ఇప్పటికే చిరు, సందీప్ మధ్య కథా చర్చలు కూడా జరిగాయని చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వాటి కారణంగా 'స్పిరిట్' ఆలస్యమైతే.. చిరు-సందీప్ ప్రాజెక్ట్ ముందు సెట్స్ మీదకు వెళ్లినా ఆశ్చర్యంలేదని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ 'స్పిరిట్' ఆలస్యం కాకపోతే మాత్రం.. 'స్పిరిట్', 'యానిమల్ పార్క్' పూర్తయ్యాక చిరంజీవి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని వినికిడి. అదే జరిగితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినట్లే.

త్వరలో 'పుష్ప-2' సినిమాతో పలకరించనున్న బన్నీ.. ఆ తరువాత దర్శకులు త్రివిక్రమ్, అట్లీ లతో సినిమాలు చేయనున్నాడు. మరి వాటి తర్వాత సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ చేస్తాడో లేక మరో డైరెక్టర్ కి షిఫ్ట్ అవుతాడో చూడాలి.