English | Telugu

త‌మ‌న్‌కే ఫిక్స‌యిన శంక‌ర్?

యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ కి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో మంచి అనుబంధమే ఉంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాయ్స్` (2003)లో ఓ హీరోగా న‌టించాడు త‌మ‌న్. అలాగే శంక‌ర్ నిర్మాణంలో
వ‌చ్చిన `ఈర‌మ్` (తెలుగులో `వైశాలి` పేరుతో అనువాద‌మైంది) (2009)కి త‌మ‌న్ నే స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. కట్ చేస్తే.. 12 ఏళ్ళ త‌రువాత త‌న మెంట‌ర్ తో మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నున్నాడ‌ట త‌మ‌న్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ - ఇండియా మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి బాణీలు అందించే అవ‌కాశం త‌మ‌న్ కి
ద‌క్కింద‌ని స‌మాచారం. త‌మ‌న్ అంటే ప్ర‌త్యేక అభిమానం ఉండ‌డంతో పాటు.. ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాది వారికి కూడా త‌మ‌న్ సుప‌రిచితుడే కావ‌డంతో.. త‌న‌వైపే మొగ్గు చూపిస్తున్నాడ‌ట శంక‌ర్. ఇంత‌కుముందు
ఈ ప్రాజెక్ట్ కి అనిరుధ్ పేరు వినిపించినా.. చిత్ర నిర్మాత `దిల్` రాజు, క‌థానాయ‌కుడు చ‌ర‌ణ్ కూడా త‌మ‌న్ కే ఓటేశార‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబో మూవీలో త‌మ‌న్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ఈ ఏడాది జూలైలో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.