English | Telugu

చ‌ర‌ణ్ - శంక‌ర్.. ముహూర్తం ఫిక్స్?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని జూలై నెల‌లో ప్రారంభించ‌డానికి యూనిట్ ప్లాన్ చేసింద‌ట‌. ఆపై ఏక‌ధాటిగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి.. 2022 ద్వితీయార్ధంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం.

కాగా, ఇందులో చ‌ర‌ణ్ కి జోడీగా ఉత్త‌రాది భామ కియారా అద్వాని న‌టించే అవ‌కాశ‌ముంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ - కియారా.. `విన‌య విధేయ రామ‌`లో జంట‌గా క‌నువిందు చేశారు. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబో మూవీలో కియారా అద్వాని ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి.. మ‌ల్టిలింగ్వ‌ల్ మూవీగా సంద‌డి చేయ‌నున్న ఈ చిత్రంతో చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.