English | Telugu

`బంగార్రాజు`లో భూమిక‌?

కింగ్ నాగార్జున చాన్నాళ్ళుగా చేయాల‌నుకుంటున్న ప్రాజెక్ట్ `బంగార్రాజు`. 2016 నాటి సంక్రాంతి విజేత `సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. `సోగ్గాడే..`ని డైరెక్ట్ చేసిన క‌ళ్యాణ్ కృష్ణ‌నే `బంగార్రాజు`కి కూడా కెప్టెన్. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జూన్ లేదా జూలైలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. `సోగ్గాడే చిన్ని నాయ‌నా` త‌ర‌హాలోనే సంక్రాంతి సీజ‌న్ లోనే `బంగార్రాజు` కూడా థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. `బంగార్రాజు`లో నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక భూమికా చావ్లా న‌టించ‌బోతుందంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అంతేకాదు.. నెగ‌టివ్ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్ లో ఆమె ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంద‌ని అంటున్నారు. మ‌రి.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, నాగ్ నిర్మించిన `యువ‌కుడు` (2000) చిత్రంతోనే భూమిక క‌థానాయిక‌గా తొలి అడుగేశారు. ఆపై `స్నేహమంటే ఇదేరా`(2001)లో నాగార్జున‌కి జంట‌గా న‌టించారు. అలాగే భూమిక నిర్మించిన `త‌కిట త‌కిట‌` (2010)లో నాగ్ అతిథి పాత్ర చేశారు. మొత్త‌మ్మీద‌.. దాదాపు ప‌దకొండేళ్ళ త‌రువాత నాగ్, భూమిక.. `బంగార్రాజు` కోసం జ‌ట్టుక‌ట్ట‌నుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.