English | Telugu
ఏపీ బ్రాండ్ అంబాసిడర్ మహేషా!
Updated : Jul 26, 2014
తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గౌరవంతో పాటు కోటి రూపాయల బహుమతిని సానియా మీర్జాకు ఇటీవలే అందుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపికి కూడా బ్రాండ్ అంబాసిడర్ ఎంచుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ గౌరవాన్ని ప్రిన్స్ మహేష్ బాబుకి కట్టపెట్టాలని అనుకుంటున్నట్లు ఆలోచనలు చేస్తున్నారట. అయితే మరి పార్టీ కోసం పనిచేసిన టాలీవుడ్ అగ్రహీరోలు పార్టీ అండగ ఉండగా మహేష్ ను అంబాసిడర్ గా నియమించటం సరైనదా కాదా అనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రిన్స్ మహేష్ కి రెండు రాష్ట్రాలలో అభిమానులుండగా ఒక రాష్ట్రానికి అంబాసిడర్ గా ఉండటానికి ఒప్పుకుంటాడా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. ఏమైనా అనుకోకుండా మహేష్, సానీయా మిర్జాల మధ్య గమ్మత్తైన పోటీ నెలకొంది. ఇప్పటివరకూ ఎన్నో జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్ గా వున్న మహేష్ ఏపీ అంబాసిడర్ కావటం గురించి ఎలా స్పందిస్తాడో తెలియాల్సివుంది.