English | Telugu
గబ్బర్ సింగ్ గా బ్రహ్మీ ఎంట్రీ
Updated : Apr 28, 2014
పవన్ కళ్యాణ్ స్టైల్ ను దాదాపు ప్రతి ఒక్కరు ఎదో ఒక సన్నివేశంలో ఫాలో అవుతూనే ఉంటారు. "గబ్బర్ సింగ్" సినిమాలో డైలాగులతో అదరగొట్టడమే కాకుండా తన స్టైల్ తో ట్రెండ్ సెట్ చేసాడు. ఇందులో బ్రహ్మానందం తన ఉద్యోగం కోసం పవన్ కటవుట్ ను వాడుకుని "కంటెంట్ ఉన్నోడికి కటవుట్ చాలు" అంటూ విలన్లకే షాక్ ఇస్తాడు.
సీన్ కట్ చేస్తే... ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అందరికి బాగా గుర్తుంది కదా. దొంగలను పట్టుకోవడానికి గుర్రంపై గబ్బర్ సింగ్ ఎంట్రీ ఇస్తాడు. పవన్ సినీ కెరీర్ లోనే ఇది బ్లాక్ బస్టర్ ఎంట్రీ. అయితే ఇపుడు ఇదే ఎంట్రీ సీన్ ను బ్రహ్మీ వాడుకుంటున్నాడు. వాడుకోవడమే కాదు.. అందులో జీవించేస్తున్నాడు.
బ్రహ్మీ తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. మీరు కింద చూస్తున్న ఫోటో ఆ సినిమాలోనిదే. గుర్రం ఎత్తు కూడా లేని బ్రహ్మీ, తన హీరోయిజం చూపిస్తూ ఎలా వస్తున్నాడో చూడండి. ఈ సినిమాలో బ్రహ్మీ తన కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడని చిత్ర యూనిట్ భావిస్తుంది.