English | Telugu
బోయపాటి డైరెక్షన్ లో బన్నీ.. సరైనోడు కాంబో రిపీట్!!
Updated : Jun 7, 2021
అల్లు అర్జున్- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ లో ఇప్పుడు మరో మూవీ రాబోతుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.
బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్పతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అయితే, సెకండ్ పార్ట్ కోసం కాస్త టైం తీసుకోవాలని మూవీ నిర్ణయించిందట. దీంతో ఆ గ్యాప్ లో బన్నీ మరో సినిమా పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే రీసెంట్ గా వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు శ్రీరామ్ ఐకాన్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండగా.. బోయపాటి కూడా ప్రస్తుతం బన్నీ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. పుష్ప ఫస్ట్ పార్ట్ పూర్తయ్యాక.. వీరిద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేయాలని భావిస్తున్న బన్నీ.. గతంలో హిట్ ఇచ్చిన బోయపాటి ప్రాజెక్ట్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా 'అఖండ' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సింహ, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ తరువాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం.. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక విడుదలయ్యే అవకాశముంది.