English | Telugu
తెలుగు భారీ బడ్జెట్ మూవీలో ధనుష్!!
Updated : Jun 7, 2021
కోలీవుడ్ హీరో ధనుష్ త్వరలో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. వైవిధ్యమైన చిత్రాలు, పాత్రలతో కోలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న ధనుష్.. డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధనుష్ స్ట్రెయిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడని టాక్ వినిపిస్తోంది.
ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించమని ధనుష్ ను సంప్రదించారని తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేస్తున్న ధనుష్.. మంచి కథ దొరికితే టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సంప్రదించడంతో ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది.
కాగా, ధనుష్ హీరోగా నటించిన ‘జగమే తంత్రమ్’ సినిమా త్వరలోనే ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల కానుంది. మరోవైపు హాలీవుడ్ సినిమా ‘గ్రే మ్యాన్’ షూటింగ్ తో ధనుష్ బిజీగా ఉన్నాడు.