English | Telugu

బాలకృష్ణ, శివ రాజ్ కుమార్, రజినీకాంత్.. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లోడింగ్!

నటసింహం నందమూరి బాలకృష్ణకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ తో ఎంత మంచి అనుబంధం ఉందో తెలిసిందే. ఇప్పటికే వీరు పలు వేదికలపై సందడి చేసి, అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ఈ ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది?.. పాన్ ఇండియా సినిమాని మించిన ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అది త్వరలోనే సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఓ భారీ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ, శివ రాజ్ కుమార్, రజినీకాంత్ చేతులు కలబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శివ రాజ్ కుమార్ స్వయంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కి ఓ కన్నడ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడట. అంతేకాదు భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కనుందని వినికిడి. మొదటి భాగంలో బాలకృష్ణ, శివ రాజ్ కుమార్ కలిసి నటించనుండగా.. రెండో భాగంలో బాలకృష్ణ, రజినీకాంత్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని న్యూస్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుంది.