English | Telugu
హజ్బెండ్‌తో విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్న బిగ్ యాక్టర్ డాటర్!
Updated : Nov 2, 2021
సెలబ్రిటీ కపుల్ సమంత, నాగచైతన్య విడిపోయిన విషయం ఇంకా జనం మనసుల్లో పచ్చిగా ఉండగానే, ఓ బిగ్ ఫ్యామిలీలో త్వరలో ఈ తరహా ఘటన చోటు చేసుకోబోతున్నదనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. జనం గుండెల్లో ఎంతో గొప్ప స్థానాన్ని పొందిన పెద్ద నటుడి కుమార్తెకు భర్తతో కొంత కాలంగా ఏమాత్రం పొసగడం లేదంట. పెళ్లయి సంతానం కలిగిన తర్వాత ఆమె భర్త నటుడిగా మారాడు. అయితే ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో అతనింకా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం అతను హీరోగా రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కలతలు చెలరేగాయనీ, వాటిని పెద్దలు కూడా పరిష్కరించలేకపోయారనీ వినిపిస్తోంది. గతంలో ఒకసారి ఆమె తన చర్య ద్వారా వార్తల్లో నిలిచింది. అప్పుడు ఆమె తండ్రి పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ఎలాగో ఆ సమస్యకు పరిష్కారం కుదిరింది. జీవితంలో తన కూతురు ముందుకు సాగడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఆమె వైవాహిక జీవితం కుదుపునకు గురైంది. ఒకవైపు తన సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కూతురి కాపురాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు.
త్వరలోనే ఆమె తన భర్త నుంచి వేరుపడటానికి సిద్ధమవుతోందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే వారిద్దరి మధ్య పరస్పర అవగాహన కూడా కుదిరిందంటున్నారు. ఇందులో ఏ మేరకు నిజం వుందో త్వరలోనే వెల్లడి కానున్నది.